E-shram portal: ఇప్పుడు 22 షెడ్యూల్డ్ భాషలలో ఈ- శ్రమ్ పోర్టల్..! 11 h ago
ఈ పోర్టల్ ను శ్రమ్ 'వన్-స్టాప్-సొల్యూషన్'గా మార్చాలనే ఉద్దేశ్యంతో కేంద్ర కార్మిక & ఉపాధి, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ-శ్రమ్ పోర్టల్‌లో బహుభాషా కార్యాచరణను ప్రారంభించారు. ఈ పోర్టల్ ఇప్పుడు మొత్తం 22 షెడ్యూల్డ్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(MEITY) అభివృద్ధి చేసిన భాషిణి యాప్ 22 భాషలతో ఈ- శ్రమ్ పోర్టల్ ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. దీనికి ముందు వెర్షన్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ భాషలలో మాత్రమే అందుబాటులో ఉండేది.
ఈ- శ్రమ్ పోర్టల్ గురించి..
దేశంలో అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉపాధి పథకాలను చేరువ చేసేందుకు మరియు దేశవ్యాప్తంగా అసంఘటిత రంగాల కార్మికులను ఒకచోట నమోదు చేయాలన్న ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం 'ఈ- శ్రమ్ పోర్టల్ ను 2021 లో ప్రారంభించింది. ఈ- శ్రమ్ పోర్టల్‌ను కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. డిసెంబర్ 19, 2024 నాటికి, ఈ- శ్రమ్ పోర్టల్ లో 30, 48, 02, 313 మంది అసంఘటిత రంగాల కార్మికులు రిజిస్ట్రేషన్ అయ్యారు. అసంఘటిత రంగాల కార్మికులకు సంబంధించి సమగ్ర జాతీయ డేటాబేస్ (NDUW)ని రూపొందించడానికి మొత్తం రూ. FY 2019-20 నుండి FY 2024-25 వరకు 704.01 కోట్లు కేటాయించబడ్డాయి.
ఈ- శ్రమ్ పోర్టల్ లక్ష్యాలు:
ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం మరియు సులభతరం చేయడం. ప్రత్యక్ష నగదు బదిలీలు మరియు డిజిటల్ చెల్లింపుల ద్వారా ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం.
ఈ- శ్రమ్ పోర్టల్ ద్వారా చేకూరే ప్రయోజనాలు:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందొచ్చు. ఈ పోర్టల్‌లో నమోదైన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యంపై లక్ష రూపాయల బీమా వర్తిస్తుంది.